Instagram Reels Crazy: సోషల్ మీడియాలో ఏదోరకంగా వైరల్ కావాలి.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి.. ఈ పిచ్చి కొందరి ప్రాణాల మీదకు తెస్తుంది.. కొన్ని సాహసాలతో రీల్స్ చేస్తు్న్నారు.. మరికొందరు డ్యాన్స్ లతో.. ఇంకా కొందరు బూతులతో రెచ్చిపోతూ.. ఫేమస్ అవుతున్నారు.. వ్యూస్, లైక్‌లు.. షేర్ల కోసం.. దేనికైనా రెడీ అవుతున్నారు.. ఇన్‌స్ట్రామ్ రీల్స్ కోసం.. ఓ విద్యార్థి కాలువలోకి దిగి గల్లంతయ్యారు.. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఇన్‌స్టా రీల్స్ కోసం నలుగురు స్నేహితులు.. సీతానగరం మండలంలోని పేరంటమ్మ కాలువ వద్దకు వెళ్లారు. కాలువలోకి దిగి రీల్స్ చేస్తున్న సమయంలో.. వినయ్ అనే విద్యార్థి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. అతడిని రక్షించడానికి స్నేహితులు, స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి..
Read Also: Lebanon – Israel: బాంబు దాడిలో 100 మందికి పైగా మరణం.. ఏడుగురు కమాండర్లను కోల్పోయిన హెజ్‌బొల్లా!
సీతానగరం మండలంలో ఇంస్టాగ్రామ్ రిల్స్ కోసం కోటి – సీతానగరం గ్రామాల మధ్య ఉన్న పేరంటమ్మ కాలువలో దిగిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్.. ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతు అయ్యారు.. ఆదివారం వీకెండ్ కావడంతో సరదాగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసేందుకు వెళ్లారు నలుగురు స్నేహితులు.. కాలువలో దిగి రిల్స్ చేస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు వెలుగుబంటి వినయ్ అనే విద్యార్థి.. గల్లంతైన విద్యార్థి సీతానగరం మండలంలో జ్ఞాననిది విద్యానికేతన్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తింపు.. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకుని విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రక్షించాలని ప్రయత్నం చేసినా విద్యార్థి నీటిలో గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం సమయంలో ఈఘటన చోటు చేసుకోగా.. చీకటికావడంతో సెల్ ఫోన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు.. ఈ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉంది.. అయితే, రీల్స్ కోసం ఏదో చేద్దామని.. ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దనిపోలీసులు సూచిస్తున్నారు..