Site icon NTV Telugu

Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి పర్మిషన్ తెచ్చింది నేనే

Murlimohan

Murlimohan

Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి నేనే సెన్షన్.. ఆర్డర్ తెచ్చానని రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు. నా తరువాత వచ్చిన మాజీ ఎంపి మార్గా భరత్ రామ్ శిలాఫలకం వేసి నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను.. ఇవాళ ఎంపీ పురంధరేశ్వరితో కలిసి ఫ్లైఓవర్ తుది దశ పనులను పరిశీలించాను పేర్కొన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చి తనే పనులు ప్రారంభించామని మాజీ ఎంపీ భరత్ తరచూ చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.

Read Also: Gujarat : టైర్లు, స్టీరింగ్ లేని క్యాప్సూల్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ

వైసీపీ మాజీ మార్గాని భరత్ రామ్ విజ్ఞతకే వదిలి వేస్తున్నానని మురళి మోహన్ అన్నారు. 2019లో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చానని చెప్పారు‌. అధికారుల అలసత్వం కారణంగా 2021లో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. మోరంపూడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి తాను తప్పని సరిగా హాజరవుతానని అంటున్నారు. తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రమ్మని అడుగుతున్నారని మాజీ ఎంపీ మురళి మోహన్ చెప్పారు.

Exit mobile version