NTV Telugu Site icon

Polavaram: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం..

Polavaram

Polavaram

Polavaram: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల రంగం నిపుణులు నేటి నుంచి నాలుగు రోజుల పాటు పరిశీలించనున్నారు. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో నిన్న డిల్లీలో సమావేశం అయిన నిపుణులు.. ఆ తర్వాత రాత్రికి రాజమండ్రికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్ట్ సైట్ లో నిపుణులు పరిశీలన చేస్తున్నారు.

Read Also: Rishi Sunak: ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పూజలు..హిందుత్వం నుంచే ప్రేరణ పొందానని వ్యాఖ్య

ఇక, డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు (ఎగువ, దిగువ ), గైడ్ బండులను విదేశీ జలవనరుల నిపుణులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ లు హాజరు అయ్యారు. నేటి నుంచి జులై 3వ తేదీ వరకు ప్రాజెక్టు సైట్ లో పనులను నిపుణులు పరిశీలించనున్నారు. అనంతరం కేంద్ర- రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి రివ్యూ చేయనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది.