NTV Telugu Site icon

Section 144 imposed in Kovvur: కొవ్వూరులో ఘర్షణ.. 144 సెక్షన్‌ విధింపు..

144

144

Section 144 imposed in Kovvur: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.. వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా.. రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో అలర్ట్‌ అయిన పోలీసులు.. కొవ్వూరులో 34 యాక్ట్ కూడా అమలులో ఉందని.. పోలీసు పికెటింగ్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తీసుకుని వెళ్తుండగా.. శ్రీరాంనగర్ , రాజీవ్ కాలనీ కు చెందిన రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. దీంతో.. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండువర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలు విసురుకోవడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. దీనితో రాజీవ్ కాలనీ, శ్రీరామ్ నగర్ లలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకుని వచ్చారు. కొవ్వూరు డీఎస్పీ దేవర కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. కొవ్వూరులో ఉద్రిక్త పరిస్థితులకు అల్లరిముకలే కారణమని డీఎస్పీ అంటున్నారు. ప్రజలంతా సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్న కారణంగా సామాజిక వర్గ నేతలు ఎవరూ కొవ్వూరు రావద్దని హెచ్చరించారు. అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు..

Read Also: iPhone 16 In India: నేటి నుండే భారత్ లో ఐఫోన్ 16 అమ్మకాలు.. క్రేజ్ మాములుగా లేదుగా..