Site icon NTV Telugu

Daggubati Purandeswari: జెమిలి ఎన్నికలు.. మంచి ఆశయంతో ఉన్నాం..

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: జెమిలి ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కమిటీ జెమిలి ఎన్నికలకు సిఫార్సు చేయడాన్ని అభినందించారు. జెమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. దీని వలన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు జరగడం వలన కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులోకి వచ్చి అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు ఎంతో ఉపయోగంగా పేర్కొన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జెమిలి ఎన్నికలపై మంచి ఆశయంతో ఉన్నామని అన్నారు. దేశ మంచిని దృష్టిలో పెట్టుకుని జెమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని అభ్యర్థన చేశారు. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తుందని మండిపడ్డారు దగ్గుబాటి పురంధేశ్వరి.. కాగా, జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది.. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. రాజ్‌నాథ్‌ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకు బిల్లు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోన్న విషయం విదితమే.

Read Also: Haryana Elections : 5 లక్షల ఇళ్లు, 2 లక్షల ఉద్యోగాలు, బాలికలకు స్కూటర్లు.. హర్యానాలో బీజేపీ హామీలు

Exit mobile version