Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి.. హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది.. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు.. 9 హార్బర్స్ కు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంలో ఎంతో చేశాం కానీ ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చేద్దాం.. ఇది వాస్తవం, అప్పటి ఐటీ మంత్రి అమర్నాథను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యస్పదంగా ఉందన్నారు. డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్ కి తెలుసా అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అడిగారు.
Read Also: SambaralaYetiGattu : సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ రిలీజ్
ఇక, డేటా సెంటర్ పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్ధమా సవాల్ అని మార్గని భరత్ సవాల్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల డెవలప్మెంట్ అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే.. జిందాల్ సంస్థను తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది.. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు.. పీపీపీ విధానంతో పబ్లిక్ ప్రాపర్టీ ఏది అని ప్రశ్నించారు. రూ. 2వ వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలో ప్రైవేటుపురం కాకుండా ఉంటాయన్నారు. నకిలీ మద్యం 3 నెలల నుంచి కొనసాగుతుందని ఐపీఎస్ అధికారులు చెప్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ తెలిపారు.
Read Also: Heart Attacks: ఈ ఐదు నియమాలు పాటిస్తే.. గుండెపోటు ప్రమాదాన్ని 80% తగ్గించవచ్చు..!
అలాగే, ఈ నెల 6వ తేదీన నకిలీ మద్యం కేసులో A1 నిందితుడు జనార్థన్ విడుదల చేసిన వీడియోలో ఎవరు లేరని చెప్పారని భరత్ రామ్ చెప్పుకొచ్చారు. పోలీస్ కస్టడీ తర్వాత జోగి రమేష్ చేశానని అబద్ధాలు చెబుతున్నాడు.. రెండేళ్లుగా నకిలీ మధ్యం తయారు చేస్తున్నానని జనార్దన్ చెప్తుంటే.. దీనిపై సిట్ విచారణ పై నమ్మకం లేదు.. సీబీఐ విచారణకు ఆదేశించండి అని కోరారు. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, అనకాపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం బయటపడింది.. ఎవరి హాయంలో నకిలీ మద్యం అమలు అవుతుందో ప్రజలందరికీ తెలిసిందన్నారు. 16 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోందని మార్గని భరత్ ప్రశ్నించారు.