Site icon NTV Telugu

Somu Veerraju: మంత్రి పదవిపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు… 2014లోనే..!

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి.. తొలిసారి రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.. అయితే, తనకు మంత్రి కావాలని లేదు.. మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యే వాడిని అని స్పష్టం చేశారు.. నా జీవితానికి ఇది చాలు.. బీజేపీలో కమిట్మెంట్ తో పని చేశా అని తెలిపారు.. దేశంలో దుమ్మున్న మొగవాడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రశంసించారు.. కూటమిలో కలవడానికి కారణం రాజకీయ వ్యూహం ఉంది.. అంతేకాదు.. త్వరలో తమిళనాడులోనే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, ఆక్వా రైతులు సమస్యలు పరిష్కారించాలని కోరారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు..

Read Also: Kedar Jadhav: బీజేపీ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ ‘‘కేదార్ జాదవ్’’..

కాగా, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలిసారి రాజమండ్రి విచ్చేసిన సోము వీర్రాజుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుండి స్టేడియం రోడ్డు, బైపాస్ రోడ్డు , జైలు రోడ్డు మీదుగా.. మంజీరా హోటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏపీ బీజేపీ తరఫున భారీ అభినందన సభ జరిగింది. బాణాసంచా, తీన్మార్ డాన్సులు, గజమాలలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు తదితరులు.. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, సోము అభిమానులు డాన్సులు వేసి కార్యకర్తలలో ఉత్సాహం నింపారు. అనంతరం జరిగిన అభినందన సభలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Exit mobile version