Somu Veerraju: ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటుచేసిన ఖాదీ సంతను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. . రెండు రోజులు పాటు ఖాదీ సంత నిర్వహించనున్నారు.. ఖాదీ ఫర్ నేషన్ – ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ ఖాదీ సంత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 స్వదేశీ వస్తువుల స్టాల్స్ ను సోము వీర్రాజు పరిశీలించారు. స్వదేశీ వస్తువుల విక్రయాలకు సంబంధించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోము వీర్రాజు వీడియోతో మాట్లాడుతూ.. స్వదేశీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా ఖాదీ సంత నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు.. ఖాదీ చేతి వృత్తులు చేనేత హస్తకళలు సేంద్రియ ఉత్పత్తులు ఆయుర్వేదం మిల్లెట్స్ , మొక్కలు పై విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..
Read Also: Dussehra : దసరా అసలు రహస్యం..! ఆయుధ పూజ ఎందుకు చేస్తారు..?
