ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. నాన్నగారి ఇంటిపై దాడి జరిగిందని చాలా బాధపడ్డానని అన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువంటి దాడులకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నాయకులు చేయించారని వచ్చిన ఆరోపణలు ఆవాస్తవమని అన్నారు. దాడి వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా.. బయటికి తీసిన చర్యలు తీసుకుంటామని జనసేన సీనియర్ నేతలు హామీ ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఈ దాడి వెనుక ఉన్న గుట్టును వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఈ దాడికి పాల్పడి ఉంటాడని అనుమానంగా ఉందని బార్లపూడి క్రాంతి చెప్పారు.
Read Also: Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అభినందనలు..
కాగా.. ఆదివారం ఉదయం ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ముద్రగడ ఇంటికి ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చి ట్రాక్టర్‌తో గేటును తర్వాత లోపలి ఉన్న కారును ఢీకొట్టాడు. అంతేకాకుండా.. ఫ్లెక్సీలను కూడా చించేశాడు. అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేసి.. రచ్చ రచ్చ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?