Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
- రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు..
- 1,917 కొనుగోలుకేంద్రాలలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు..
- ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rabi Paddy Procurement: రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపటి నుంచి రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన ఈ వివరాలు తెలియజేశారు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,917 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఇక, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రైతులు తమ పంటకు సరైన ధర పొందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం నిల్వ మరియు రవాణా విషయంలో కూడా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. మొత్తం 5.40 కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు, గోతాల కొరత రాకుండా మిల్లర్లతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిపారు. అలాగే ధాన్యం రవాణా కోసం 17,200 లారీలను జీపీఎస్ సదుపాయంతో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా, ఈసారి రబీ ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరిగేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!