Site icon NTV Telugu

Polavaram Project: మారిన పోలవరం డెడ్‌లైన్‌.. ఆరు నెలల ముందే పూర్తి..!

Polavaram

Polavaram

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం డెడ్‌లైన్‌ మారిపోయింది.. మరో ఆరు నెలల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అయితే, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా ప్రకటించారని అన్నారు. రాజమండ్రిలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిన్నటికి 202 మీటర్లు పూర్తి అయ్యిందని ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని అన్నారు. 990 కోట్ల రూపాయలతో డయాఫ్రం వాల్ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు.

Read Also: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌ మరణం తర్వాత ఏం జరగనుంది.. ఎక్కడ ఖననం చేస్తారంటే..?

2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా ప్రకటించారు.. కానీ, గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నాం అని వెల్లడించారు నిమ్మల రామానాయుడు.. ఇక, డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా వైసీపీలో ఇరిగేషన్ మంత్రులు మాట్లాడారు.. ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడు పోలవరం ప్రాజెక్టుపై ధ్యస పెట్టలేదని విమర్శించారు. 1200 కోట్లతో పోలవరం ఎడమ కాలువ పూర్తి చేస్తున్నాం.. ఈ వేసవిలో కాల్వల మరమ్మతుల కోసం 366 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..

Exit mobile version