Minister Durgesh: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రజామోదంగా ఉంది అన్నారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని తప్ప ఏమీ లేదని పేర్కొన్నారు.. అలాగే, అన్ని రంగాలకు, పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు ఆశోధనకంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో పర్యాటక శాఖ మంత్రులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను దూషించడానికి పని చేశారు అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Read Also: SLBC Tragedy: టెన్నెల్ దగ్గరకు చేరుకున్న ఉస్మానియా వైద్య బృందం
ఇక, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తున్నాను అని మంత్రి దుర్గేష్ చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక పాలసీ ద్వారా పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంది.. ఇందు కోసం ప్రాంతాల వారీగా సమ్మిట్ లు పెడుతున్నాం అన్నారు. ఈ నెల నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో జర్మనిలో పర్యటక శాఖ సమ్మిట్ ఉంది.. ఆ మీటింగ్ లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.