Site icon NTV Telugu

Aqua Crop Holiday: ప్రాసెసింగ్ యూనిట్లపై ఆగ్రహం.. రొయ్యల రైతులు క్రాప్ హాలిడే..

Aqua Crop Holiday

Aqua Crop Holiday

Aqua Crop Holiday: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రొయ్యల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అమెరికా సుంకాల పేరుతో గంటల వ్యవధిలో రొయ్యల రేట్లు తగ్గించిన ప్రాసెసింగ్ యూనిట్ల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలకొల్లు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట, నిడమర్రు, గణపవరం తూర్పుగోదావరి జిల్లాల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. జులై నుండి కచ్చితంగా క్రాఫ్ హాలిడే ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. మూడు నెలలపాటు అమెరికా సుంకాలు తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భంగా వెంటనే రొయ్యల రేట్లు పెంచి కొనుగోలు చేయాలి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, క్రాప్ హాలిడే విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 13న మరోసారి సమావేశం కానున్నట్లు జైభారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం చైర్మన్‌ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు తెలిపారు. క్రాఫ్‌ హాలిడేపై సంఘ సభ్యులు, ముఖ్య నాయకులతో చర్చించామని.. ఇద్దరు సభ్యులతో గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి చెరువులు, రైతుల వివరాలను నమోదు చేయనున్నట్టు వెల్లడించారు.. హేచరీలు, రొయ్య కొనుగోలు చేసే ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ల వరకూ సిండికేట్‌గా ఆక్వా రైతులను 30 ఏళ్లగా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Hanmakonda: చెరువులో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

Exit mobile version