Site icon NTV Telugu

MLC Anantha Babu Case: మళ్లీ తెరపైకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు..

Mlc Anantha Babu Case

Mlc Anantha Babu Case

MLC Anantha Babu Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంత బాబు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా రాజమండ్రికి చెందిన మొక్కల సుబ్బారావును నియమించారు. కేసు తదుపరి విచారణ చేసే అధికారులకు న్యాయ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా ముప్పాళ్ల సుబ్బారావును కోరుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో ఇంకా ఎటువంటి విషయాలు చర్చించాలి..? జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నాపై ఉన్న నమ్మకంతో బాధ్యతలు నిర్వర్తించి సహాయ, సహకారాలు అందిస్తానని అంటున్నారు ప్రముఖ న్యాయవాది ముప్పళ్ల సుబ్బారావు..

Read Also: AP Government Survey: ప్రభుత్వ సేవలపై సర్వే.. షాకింగ్‌ విషయాలు వెలుగులోకి..!

Exit mobile version