NTV Telugu Site icon

Cock Fights: కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు.. బరులు సిద్ధం

Cock Fights

Cock Fights

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో పందేలు కాయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నిర్వాహకులు.. ఒకపక్క పోలీసుల అంచులు కొనసాగుతున్న నిర్వాహకులు పందెంబరులను అందంగా ముస్తాబు చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈసారి పందాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. పందాల పరిల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చే వారికోసం టెంట్లు షామియానాలు ఒకపక్క, కోడిపుంజులకు అవసరమైన ఏర్పాట్లు మరోపక్క చేస్తున్నారు నిర్వాహకులు.

Read Also: Stock Market : ఫారిన్ ఇన్వెస్టర్ల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరిలోనే ఎందుకు మొదలవుతుంది ?

పామాయిల్, కొబ్బరి తోటలు, పొలాలు చెరువుగట్లు అన్ని చోట్ల కోడిపందాలు సందడే కనిపిస్తోంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చి అతిథుల కోసం రకరకాల ఏర్పాట్లలో కోడిపందాల నిర్వాహకులు నిమగ్నమయ్యారు. భారీ టెంట్లు వేసి బంధాలు నిర్వహించేవారు కొందరైతే, పామాయిల్ తోటల్లో చెట్ల నీడన కోడిపందాలు నిర్వహించేందుకు మరికొందరు ఏర్పాట్లు చేస్తున్నారు. భోగి మధ్యాహ్నం నుంచి పందాల జోరు పెరగనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్ల కంటే.. పామాయిల్, కొబ్బరి తోటల్లో ఏర్పాట్లపై నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు.

Read Also: Revanth Reddy: 35 ఏళ్ల విద్యార్థి, రాజకీయ జీవితంలో వీళ్లతోనే కలిసి పని చేశా..

Show comments