Duvvada Srinivas: దువ్వాడ వాణి రోజుకో రకంగా మాటాడుతున్నారు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలను ఇంటిపైకి పంపించారు.. టెక్కలి వదిలి వెళ్లాలని మాట్లాడారు.. ఆస్తులపై మాట్లాడారు.. తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా.. ఒకవైపు పెద్దమనుషులను పంపిస్తూ.. మరో వైపు కోర్టుకు పోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతుళ్ల పేరు మీద సుమారు రూ. 27 కోట్ల ఆస్తులు రాయటానికి సిద్దంగా ఉన్నాను.. కానీ, ఈ కొత్త ఇళ్లు మాత్రం రాసివ్వడానికి సిద్ధంగా లేను చెప్పారు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయవద్దు.. ఓ బంగాళ ఇచ్చాను వాడుకోండి అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.
Read Also: Akhilesh Yadav: కోల్‌కతా వైద్యురాలి ఘటనలో మమతా బెనర్జీకి అఖిలేష్ మద్దతు..
ఇక, 16 నెలల్లో ఖర్చుల కోసం రూ. 40 లక్షలు ఇచ్చాను అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను తెలిపారు. లాయర్ చెప్పడంతో వాణి మాట మార్చారు.. నాటకీయంగానే ప్రస్తుతం మాట మార్చింది.. ఒక్కో రోజు ఒక్కొ కండిషన్.. ఇప్పుడు కొత్తగా కలిసి ఉంటానని చెప్తుంది.. ఇంటిలోంచి తరిమి వేసిన తర్వాత చచ్చానా, బ్రతికానా చూడలేదు.. కుటుంబ పెద్దల ఒడంబడిక ద్వారా ఆస్తులు ఇవ్వాడానికి ఇష్ట పడుతున్నాను.. పిల్లలకు నాపై తప్పుడు మాటలు చెప్పింది.. భర్తను పెద్దమనుషులను వాణి గౌరవించదు.. దువ్వాడ టెక్కలిలో ఉండకుడదు.. రాజకీయంగా పతనం చెయాలన్నది వాణి ఉద్దేశం.. కోర్టులలోనే తేల్చుకుంటామని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
