Vijayawada: ఈ మధ్యనే దసరా నవరాత్రులు ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఎక్కడా లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలతో దసరా నవరాత్రులు నిర్వహించామని పేర్కొన్నారు. దసరా నవరాత్రులను విజయవంతంగా నిర్వహించడంలో అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది అద్భుతమైన పని తీరును కనబరిచి అంకిత భావంతో విధులు నిర్వహించారని వెల్లడించారు. కాగా సీఎం జగన్ సూచనల మేరకు గతం కంటే మెరుగ్గా ఈ సంవత్సరం దసరా వేడుకలు నిర్వహించామని తెలిపారు. అలానే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ ఈఓ కె.ఎస్.రామారావు కూడా నవరాత్రుల నిర్వహణ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈఓ కె.ఎస్.రామారావు ప్రస్తావిస్తూ.. దసరా ప్రారంభంలో నేను ఛార్జ్ తీసుకున్నానని తెలిపిన ఆయన అనధికార వీఐపీలను కంట్రోల్ చేస్తూ దసరా నిర్వహించామని పేర్కొన్నారు.
Read also:Puvvada Ajay Kumar: మీ పాలనలో వాటర్ ట్యాంకర్‌లు తిరిగితే.. మా పాలనలో ఇంట్లో టాప్‌లు తిప్పుతున్నారు!
అలానే మంత్రి కొట్టు సత్యనారాయణ కమీషనర్, సీపీ, కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా దసరా ఉత్సవాలు విజయంవతంగా నిర్వహించగలిగామని వెల్లడించారు. కాగా నవమి, దశమి ఒకేరోజు వచ్చాయ ని. దీనితో తొమ్మిది రోజులే దసరా నిర్వహించామని తెలిపారు. అలానే గుడికి వచ్చే ఆదాయం కంటే దేవి దర్శనానికి భక్తితో గుడికి వచ్చే భక్తుల సంతృప్తి ధ్యేయంగా ఉత్సవాలు నిర్వహించామని.. ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజు 1:30 నుంచే దర్శనం ప్రారంభించామని.. అయిన మూలా నక్షత్రం రోజున అదనపు సమయం దర్శనం ఇవ్వాల్సి వచ్చింది పేర్కొన్నారు. అలానే మూల నక్షత్రం రోజు సీఎం గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కూడ సజావుగా జరిగిందని తెలిపారు. కాగా అర్చకసభ నిర్వహించే కీర్తి ఇంద్రకీలాద్రికే దక్కుతుందని.. తెప్పోత్సవం కూడా ఎంతో గొప్పగా జరిగిందని.. అన్న ప్రసాదం సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించాము అని తెలిపారు.
Read also:Israel Hamas War: ఇజ్రాయెల్ యుద్ధంలో యారో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్.. ఈ హమాస్ మటాషే
అలానే భక్తుల కోసం 600 మంది క్షురకులు, 800 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసామని వెల్లడించారు. అలానే 25 లక్షల విలువైన బస్సును కెనరా బ్యాంకువారు ఆలయానికి బహుకరించారని పేర్కొన్నారు. కాగా దసరా ఉత్సవాల్లో అల్లర్లు రేకెత్తకుండా పోలీసు సిబ్బంది 3400 మంది పనిచేసారు అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆదాయం గురించి కూడా వెల్లడించారు. అలానే గుడికి 12 లక్షల, 2వేల 678 మంది భక్తులు వచ్చినట్టుగా సాంకేతికంగా గుర్తించాము అని తెలిపిన ఆయన.. దాదాపు 15 లక్షల మంది భక్తులు దసరాకు వచ్చి ఉండచ్చు అని తెలిపారు. దసరా సందర్భంగా గుడికి 14.71 కోట్లు ఆదాయం వచ్చిందని.. గత ఏడాదికంటే ఈ ఏడాది ఉత్సవాలు ఒకరోజు తక్కువగా నిర్వహించిన ఆదాయం మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగానే వచ్చిందని తెలిపారు. లడ్డు ప్రసాదాలు 15,05,638 అమ్మకం జరిగాయని..అలానే లడ్డు ప్రసాదం ఆదాయం 3.75 కోట్లు అని తెలిపారు.
Read also:Nadendla Manohar: ఏపీలో పశువుల స్కామ్..! రూ. 2,850 కోట్ల అవినీతి జరిగింది..!
కాగా 14 నవంబరు నుంచీ 12 డిసెంబరు వరకూ కార్తీక మాసంలో భవానీలు వస్తారు అని తెలిపిన ఆయన.. కార్తీక శుద్ధ విదియ నాడు గాజుల అలంకారం జరగగా.. నవంబరు 23 వ తేదీ నుంచీ నవంబరు 27వ తేదీ వరకూ మండల దీక్షలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలానే డిసంబర్ 11వ తేదీ నుంచీ డిసంబర్ 17వ తేదీ వరకూ అర్ధమండల దీక్షలు స్వీకరిస్తారని కాగా జనవరి 3 నుంచీ 7 వరకూ దీక్షల సమాప్తి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. అలానే డిసంబర్ 26వ తేదీ పూర్ణిమ సందర్భంగా కలశజ్యోతి కార్యక్రమం ఉంటుంది అని తెలియచేసారు.
