NTV Telugu Site icon

Vijayawada: ఈనెల 25న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం మూసివేత

Durga Temple

Durga Temple

Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Lady Blackmailer: ఫేస్‌బుక్‌ వేదికగా ముగ్గులోకి దింపుతుంది.. వారిని అలరిస్తుంది.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌!

మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వీఐపీలకు పరిమితమైన అంతరాయల దర్శనం సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రోటోకాల్ ఉన్నవారికే అంతరాలయ దర్శనం కల్పించేవాళ్లమని.. ఇక నుంచి అందరికీ ఈ అవకాశం కల్పిస్తామన్నారు. అయితే గతంలో ప్రోటోకాల్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్ ధర ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ టిక్కెట్ ధరను రూ. 500కి పెంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇకపై అంతరాలయ దర్శనం కోసం ప్రోటోకాల్ అవసరం లేదన్నారు. రూ.500 టిక్కెట్ ధరపై అంతరాలయ దర్శనంతో పాటు రెండు అమ్మవారి లడ్డూ ప్రసాదాలు, అర్చకుల ఆశీర్వచనం ఉంటాయని అధికారులు చెప్పారు.