ప్రైవేట్ బస్సులను ఆశ్రయించకండి.. ఆర్టీసీ ప్రయాణం.. సురక్షితం అంటూ ప్రచారం చేస్తారు అధికారులు.. అసలే బస్సు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గమ్యానికి చేరుకుంటామే..? లేదో..? కూడా తెలియని పరిస్థితి.. దీంతో.. ఆ బస్సును నడుపుతోన్న డ్రైవర్‌ను మందలించారు ప్రయాణికులు.. అయితే, ప్రయాణికులు మందలించడాన్ని జీర్ణించుకోలేకపోయపోయిన సదరు ఆర్టీసీ డ్రైవర్.. అర్ధరాత్రి.. మార్గం మధ్యలో బస్సును వదిలేసి వెళ్లిపోయారు.. ఎంతకీరాకపోవడంతో.. ఆందోళనకు గురైన అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
Read Also: Nizamabad: జిల్లాలో కుండపోత వర్షం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కి పోటెత్తిన వరద
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడప డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో 35 మంది ప్రయాణికులతో కడప నుంచి బెంగళూరుకు బయల్దేరింది.. అయితే, బస్సును డ్రైవర్ ఇష్టంవచ్చినట్టుగా డ్రైవ్ చేస్తుండడంతో.. భయాందోళనకు గురైన ప్రయాణికులు.. అసలే వర్షాలు, ప్రమాదానికి అవకాశం ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో.. అతడిని మందలించారు. దీంతో ఆ డ్రైవర్ ఎలా భావించాడో ఏమో తెలియదు.. కానీ, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ సమీపంలో బస్సును రోడ్డుపైనే వదిలేసిన వెళ్లిపోయాడు.. చాలాసేపు డ్రైవర్ కోసం వేచిచూసిన ప్రయాణికులు.. ఎంతకీరాకపోవడంతో.. ఆర్టీసీ అధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. మరో డ్రైవర్‌ను పంపించి.. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చారు.. అయితే, బస్సును డ్రైవర్ మధ్యలోనే వదిలివెళ్లింది నిజమేనని, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలుసుకుంటామని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు.