Site icon NTV Telugu

99 శాతం మందికి మొదటి డోసు పూర్తి చేశాం: డాక్టర్‌ హైమవతి

ఆంధ్రప్రదేశ్‌ ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా. హైమవతి ఒమిక్రాన్‌ కేసులపై ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రస్తుతం రెండు ఒమిక్రాన్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు.కేంద్రం డిసెంబర్ మొదటి తేదీ నుంచి కోవిడ్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ర్టంలో 99శాతం మందికి మొదటి డోసు వేయడం పూర్తయిందని వెల్లడించారు. మేము నవంబర్ చివరి వారం నుంచే ప్రయాణికులను ట్రేస్ చేయటం ప్రారంభించడంతో కేసులు పెరగకుండా చూడగలిగామని పేర్కొన్నారు. 72 శాతం జనాభాకు రెండు డోసులు పూర్తి చేశామని ఆమె అన్నారు.

ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో వందశాతం మొదటి టీకా డోసు పూర్తయినట్టు తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న అందరినీ హోం ఐసోలేషన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు ఆమె చెప్పారు. కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని, కానీ పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉండకపోవచ్చని హైమవతి అభిప్రాయపడ్డారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొవడానికి రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తున్నామని, కోవిడ్‌ ప్రొటోకాల్సన్‌ అందరూ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని హైమవతి సూచించారు.

https://ntvtelugu.com/niranjan-reddy-and-errabelli-dayakar-rao-were-critical-of-the-central-government/


Exit mobile version