Site icon NTV Telugu

Vishaka: ఆస్పత్రిలో దారుణం.. మైనర్ బాలికపై డాక్టర్ వెకిలి చేష్టలు

Sexual Herrasment

Sexual Herrasment

విశాఖలో దారుణం వెలుగు చూసింది. ఉక్కు ఉద్యోగుల జనరల్ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నీచంగా ప్రవర్తించాడు. తన వంకరబుద్ధిని బయటపెట్టాడు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై చీఫ్ డాక్టర్ కపాడియా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో సదరు బాలిక ఆస్పత్రి బయటకు వచ్చి 100 నంబర్‌కు కాల్ చేసింది. తనపై వెకిలి చేష్టలకు పాల్పడ్డ డాక్టర్‌పై తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

మరోవైపు విశాఖ కేజీహెచ్ గైనిక్ వార్డులో సిబ్బంది నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. పాప పుడితే రూ. రెండు వేలు, బాబు పుడితే రూ. మూడు వేలు సిబ్బంది డిమాండ్ చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున పెషేంట్లను ఉంచుతున్నారని.. అదే సింగిల్ బెడ్ కావాలంటే రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేలు వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిస్తేనే బిడ్డను ఇస్తామంటున్నారని తల్లులు వాపోతున్నారు.
కొందరు చేసేదేం లేక తప్పని పరిస్థితుల్లో డబ్బులు సమర్పించుకుంటున్నారని.. డబ్బు లేని వాళ్లు మాత్రం అవస్థలకు గురవుతున్నారని ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Woman Protest: కృష్ణా నదిలో మహిళ దీక్ష.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Exit mobile version