NTV Telugu Site icon

DK Aruna: వైఎస్‌ ఫ్యామిలీలో విభేదాల వల్లే షర్మిల పార్టీ.. ఏపీలో పోటీచేయొచ్చుగా..!

Dk Aruna

Dk Aruna

తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారన్నారు.. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయలేదని.. సెంటిమెంట్ ఉన్నంత వరకు ఆంధ్రావాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించబోరన్నారు.. ఇక, వైఎస్‌ షర్మిల.. ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా…? తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు..? అని ప్రశ్నించారు.. 2019 ఎన్నికలలో కూడా షర్మిల.. ఏపీలోనే ప్రచారం చేశారని గుర్తుచేసిన ఆమె.. అప్పుడు తెలంగాణలో ఆమె ఎక్కడ ఉన్నారు? ఏపీలో ఎందుకు పోటీ చేయడం లేదో ఆమె చెప్పాలని సవాల్‌ చేశారు.

Read Also: Srilanka Crisis: ఉద్యోగాలు లేక ప్రత్యామ్నాయం దొరక్క.. ఒళ్లు అమ్మకుంటున్న మహిళలు

బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం, విభజన సందర్భంగా ముంపు మండలాలను ఏపీలో కలిపారు.. కేసీఆర్‌ ఇప్పుడు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు డీకే అరుణ.. అక్కడి ప్రజలు తెలంగాణలో‌ కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.. అక్కడ మౌలిక వసతులు లేవు, కనీస అవసరాలు తీర్చ లేదని.. అందుకే ప్రజల నుంచి డిమాండ్‌లు పెరుగుతున్నాయన్నారు.. ఇక, బీజేపీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు.. పెద్ద నాయకుల నుండి కింది స్థాయి నాయకుల వరకు ఉన్నారు.. ఏ సమయంలో చేర్చుకోవాలో మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు.. టీఆర్ఎస్‌ ప్రభుత్వం పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది.. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, కాళేశ్వరం విషయంలో వైఎస్‌ జగన్, కేసీఆర్‌పై మంచి అండర్ స్టాండింగ్ ఉంది.. ఓట్లు సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని విమర్శించారు డీకే అరుణ..

Show comments