Site icon NTV Telugu

AP SSC Exams: ఎగ్జామినేషన్ ఇన్‌ఛార్జిలే సూత్రధారులు

Ssc Exams

Ssc Exams

ఏపీలో SSC పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని SSC ఎగ్జామినేషన్ డైరెక్టర్ దేవానంద రెడ్డి ఎన్టీవీతో చెప్పారు. ఇప్పటి వరకు పేపర్ లీక్ కాలేదన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక క్యశ్చన్ పేపర్ షేర్ అయింది. ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్‌ఛార్జ్ లే దీనికి సహకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఏపీ వ్యాప్తంగా మాస్ కాపీయింగ్ కి సహకరిస్తున్న 55 మందిని అరెస్ట్ చేసాం అన్నారు దేవానంద్ రెడ్డి.

అందులో 35 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే వున్నారన్నారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేసాం. విద్యాహక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇప్పటి వరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 150 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదు. పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి క్వశ్చన్, అండ్ ఆన్సర్ షీట్ పై విద్యార్థి హాల్ టికెట్ నంబర్ వేయాల్సి ఉంటుందన్నారు దేవానంద్ రెడ్డి.

Vishwak Sen: నన్ను ఎవరు ఏమీ పీకలేరు.. రాసి పెట్టుకో

Exit mobile version