Site icon NTV Telugu

ఏపీ గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారింది : ధూళిపాళ్ళ నరేంద్ర

పోలీసులు డ్రగ్స్ విషయంలో ఉద్దేశపూర్వంకంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ నాయకులను కాపాడేందుకు డిజిపి, విజయవాడ సీపీ తప్పుడు ప్రకటనలు చేశారు అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు. విజయవాడ కేంద్రంగానే హెరాయిను వ్యాపారం జరిగింది అనడానికి ఆషీ ట్రేడింగ్ సుధాకర్ సంస్థ కట్టిన జిఎస్టీలే రుజువు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ హెరాయిన విషయంలో వైసీపీ నాయకులను కాపాడటం సిగ్గు చేటు. గత నెల 20 న హెరాయిన్ పట్టుబడితే నిన్న సీఎం ఆ అంశంపై మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించిన ఆయన ఏపీ గంజాయి, డ్రగ్సుకు అడ్డాగా మారింది అని తెలిపారు. ఏపీలో గంజాయి సాగులో వైసీపీ నేతల హస్తం ఉంది. ఒక పెద్ద మాఫియా ఏపీలో నడుస్తుంది. కాకినాడలో ఎన్నో బొట్లు తగలబడితే.. పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఐ అడిగారు. కాకినాడలో బోట్లు తగలబడుతుంటే.. పోలీసులు బొట్లు తిరగబడుతున్నాయి అని రాస్తున్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే సీఎం ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు. ఆషీ ట్రేడింగ్ సుధాకర్ వెనుక ఉన్న వైసీపీ పెద్దలు ఎవరో తేలాలి అని పేర్కొన్నారు.

Exit mobile version