Site icon NTV Telugu

ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం..?

ఏపీలో క్యాసినో మంట రాజుకుంటూనే వుంది. కొడాలి నానిపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నేత ధూళిపాళ్ళ నరేంద్ర స్పందించారు. గుడివాడ కె కన్వెన్షన్లోనే క్యాసినో నిర్వహించారని ఆధారాలంటూ కొన్ని వీడియో క్లిప్పింగులను మీడియాకు విడుదల చేశారు టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర. క్యాసినో నిర్వాహకుడు ప్రేమల్‌ టోపీ వాలా ఫేస్ బుక్‌ అకౌంట్లల్లోని వీడియోలను మీడియాకు రిలీజ్‌ చేశారు ధూళిపాళ్ల.

కొడాలి కన్వెన్షన్‌లోనే క్యాసినో నిర్వహించారని అన్ని ఆధారాలు బయటపెట్టాం, నిన్నటి సవాల్‌కు సమయం, సందర్భం ఎప్పుడో కొడాలి నానినే తేల్చుకోవాలి. తన కన్వెన్షన్‌లో క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని బుకాయించారు. నిరూపిస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని సవాల్ కూడా విసిరారు.

నేను బయటపెట్టిన ఆధారాలపై కొడాలి నాని ఏం సమాధానం చెప్తారు..? సామాజిక మాధ్యమాల్లో ఏమూలకు వెళ్లినా ఇలాంటి వీడియోలు కోకొల్లలు. ఒక మంత్రి బరితెగించి బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం..? 3 రాజధానులకు తోడుగా నాలుగోది జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా..?

సీఎం, డీజీపీల మౌనం చూస్తుంటే రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఇంతవరకూ మంత్రి కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు..? సీఎం సహకారంతోనే ఈ క్యాసినో జరిగిందా..? ఏసెస్ క్యాసినో నిర్వాహకులు అధికారికంగా తమ వెబ్ సైట్ లో గుడివాడలో 3 రోజులు క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

https://ntvtelugu.com/bonda-uma-was-highly-critical-of-the-ycp-government/

ప్రేమల్ టోపీవాలా అనే వ్యక్తి గుడివాడలో క్యాసినో నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో బహిరంగ ప్రచారం చేశారు. కొడాలి నాని మాటకు కట్టుబడి ఉంటే ఏసెస్ క్యాసినో నిర్వహణపై ఏం సమాధానం చెప్తారు..? అని ప్రశ్నించారు నరేంద్ర. పేకాట క్లబ్‌లు, క్యాసినోల నిర్వహణపై ఉన్న శ్రద్ధ పౌరసరఫరాల శాఖ మంత్రికి రైతులపై లేకపోవటం దుర్మార్గం. మంత్రి ఇలాకా కాబట్టే క్యాసినో నిర్వహణపై 3రోజులు పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడలేదు. ఎంతోమంది మహానుభావులు పట్టిన గడ్డను మంటగలుపుతున్నారని మండిపడ్డారు.

Exit mobile version