ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో క్యాసినో మంట రాజుకుంటూనే వుంది. కొడాలి నానిపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నేత ధూళిపాళ్ళ నరేంద్ర స్పందించారు. గుడివాడ కె కన్వెన్షన్లోనే క్యాసినో నిర్వహించారని ఆధారాలంటూ కొన్ని వీడియో క్లిప్పింగులను మీడియాకు విడుదల చేశారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. క్యాసినో నిర్వాహకుడు ప్రేమల్ టోపీ వాలా ఫేస్ బుక్ అకౌంట్లల్లోని వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు ధూళిపాళ్ల.
కొడాలి కన్వెన్షన్లోనే క్యాసినో నిర్వహించారని అన్ని ఆధారాలు బయటపెట్టాం, నిన్నటి సవాల్‌కు సమయం, సందర్భం ఎప్పుడో కొడాలి నానినే తేల్చుకోవాలి. తన కన్వెన్షన్‌లో క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని బుకాయించారు. నిరూపిస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని సవాల్ కూడా విసిరారు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
నేను బయటపెట్టిన ఆధారాలపై కొడాలి నాని ఏం సమాధానం చెప్తారు..? సామాజిక మాధ్యమాల్లో ఏమూలకు వెళ్లినా ఇలాంటి వీడియోలు కోకొల్లలు. ఒక మంత్రి బరితెగించి బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం..? 3 రాజధానులకు తోడుగా నాలుగోది జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా..?
సీఎం, డీజీపీల మౌనం చూస్తుంటే రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఇంతవరకూ మంత్రి కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు..? సీఎం సహకారంతోనే ఈ క్యాసినో జరిగిందా..? ఏసెస్ క్యాసినో నిర్వాహకులు అధికారికంగా తమ వెబ్ సైట్ లో గుడివాడలో 3 రోజులు క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రేమల్ టోపీవాలా అనే వ్యక్తి గుడివాడలో క్యాసినో నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో బహిరంగ ప్రచారం చేశారు. కొడాలి నాని మాటకు కట్టుబడి ఉంటే ఏసెస్ క్యాసినో నిర్వహణపై ఏం సమాధానం చెప్తారు..? అని ప్రశ్నించారు నరేంద్ర. పేకాట క్లబ్‌లు, క్యాసినోల నిర్వహణపై ఉన్న శ్రద్ధ పౌరసరఫరాల శాఖ మంత్రికి రైతులపై లేకపోవటం దుర్మార్గం. మంత్రి ఇలాకా కాబట్టే క్యాసినో నిర్వహణపై 3రోజులు పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడలేదు. ఎంతోమంది మహానుభావులు పట్టిన గడ్డను మంటగలుపుతున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!