NTV Telugu Site icon

TTD: వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్‌ డిమాండ్.. 45 నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు..

Ttd

Ttd

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. రోజులతో సంబంధం లేకుండా వేలాది మంది శ్రీవారిని దర్శించుకుంటారు.. అయితే, ప్రత్యేక రోజుల్లో మరింత రద్దీగా ఉంటాయి తిరుమల గిరులు.. ఇక, వైకుంఠ ఏకాదశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది.. ఇక ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల రద్దీ తప్పదనే మరోసారి రుజువైంది.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.. అయితే, కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే 2 లక్షల టికెట్లు బుక్‌ చేసుకున్నారు భక్తులు.. సర్వ దర్శనం భక్తులకు జనవరి 1వ తేదీన ఆఫ్ లైన్ విధానంలో టికెట్లను కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకి 50 వేల చొప్పున 5 లక్షల టికెట్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. కాగా, ఇవాళ టీటీడీ ఆన్ లైన్ లో విక్రయించిన టికెట్ల ద్వారా 6.6 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంది.

Read Also: Farmers’ debts: రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు.. కేంద్రం ప్రకటన..

Show comments