NTV Telugu Site icon

విజయసాయి రెడ్డికి దేవినేని ఉమ కౌంటర్‌

రోజురోజుకు ఏపీలో టీడీపీ, వైసీపీ నేల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. సీఎం జగన్‌ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలతో ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. అంతేకాకుండా గత పది రోజుల నుంచి వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు టెర్రరిస్టు అంటూ ఇటీవల విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కౌంటర్‌ ఇచ్చారు.

విజయసాయిరెడ్డి ఏ ఆధారాలు ఉన్నాయని చంద్రబాబును టెర్రరిస్టు అన్నారని.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పోలీసులు స్పందించి నోటీసులిస్తారా.. అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఆర్థిక ఉగ్రవాది విజయసాయి రెడ్డి దగ్గర చంద్రబాబు నడవడి నేర్చుకోవాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుపై ఇలా మాట్లాడడం సరైంది కాదని ఆయన అన్నారు.