Devineni Uma: మంత్రి అంబటి కుట్రలు, విద్వేషాలు ఆపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఒకవైపు ట్వీట్ల యుద్ధం నడుస్తుంటే… మరోవైపు ఫేక్ ట్వీట్ల రగడ రాజకుంటోంది.ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ఆయన స్పందించారు. తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి ప్రచారంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమా. అలాంటి ట్వీట్లు తాను ఎలా పెడతానని ఉమా ప్రశ్నించారు. ఈ నకిలీ ట్వీట్‌ను తనతోపాటు అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. మంత్రి అంబటి ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తున్నారంటూ దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఉదయం 11 గంటలకు డీజీపీ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు ఉమా. బాధ్యత కలిగిన మంత్రి అంబటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కుట్రలు పన్నుతున్నారు.
Also Read
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్‌పై సజ్జల తీవ్ర విమర్శలు..
సీఎం జగన్, సజ్జల నాయకత్వంలో కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్, సజ్జల, మంత్రి అంబటి మీద విబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాను. కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టడం, మార్ఫింగ్ చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయమని కోరా. టీడీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. మంత్రి అంబటిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు.. ఎప్పుడు విచారణ చేపడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించకుంటే కోర్టుకెళ్తాను. ఈ కుట్రలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు దేవినేని ఉమా. అంబటిని విచారించే దమ్ము సీఐడీ చీఫ్ కు వుందా అని ఉమా సవాల్ విసిరారు. ఏపీలో మాజీ ఇరిగేషన్ మంత్రి.. తాజా ఇరిగేషన్ మంత్రుల మధ్య వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మరి, ఈ ఎపిసోడ్ లో సీఐడీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
Driver Yang Yong: నువ్వు నిజమైన హీరోవి.. ప్రాణాలు నీకు తృణపాయం..
తాజావార్తలు
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!