NTV Telugu Site icon

Devineni Uma: మంత్రి అంబటి కుట్రలు, విద్వేషాలు ఆపండి

Ambati1

Ambati1

ఏపీలో ఒకవైపు ట్వీట్ల యుద్ధం నడుస్తుంటే… మరోవైపు ఫేక్ ట్వీట్ల రగడ రాజకుంటోంది.ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ఆయన స్పందించారు. తన పేరుతో నకిలీ ట్వీట్‌ సృష్టించి ప్రచారంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమా. అలాంటి ట్వీట్లు తాను ఎలా పెడతానని ఉమా ప్రశ్నించారు. ఈ నకిలీ ట్వీట్‌ను తనతోపాటు అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. మంత్రి అంబటి ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తున్నారంటూ దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఉదయం 11 గంటలకు డీజీపీ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు ఉమా. బాధ్యత కలిగిన మంత్రి అంబటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కుట్రలు పన్నుతున్నారు.

సీఎం జగన్, సజ్జల నాయకత్వంలో కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్, సజ్జల, మంత్రి అంబటి మీద విబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాను. కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టడం, మార్ఫింగ్ చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయమని కోరా. టీడీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. మంత్రి అంబటిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు.. ఎప్పుడు విచారణ చేపడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించకుంటే కోర్టుకెళ్తాను. ఈ కుట్రలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు దేవినేని ఉమా. అంబటిని విచారించే దమ్ము సీఐడీ చీఫ్ కు వుందా అని ఉమా సవాల్ విసిరారు. ఏపీలో మాజీ ఇరిగేషన్ మంత్రి.. తాజా ఇరిగేషన్ మంత్రుల మధ్య వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మరి, ఈ ఎపిసోడ్ లో సీఐడీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Driver Yang Yong: నువ్వు నిజమైన హీరోవి.. ప్రాణాలు నీకు తృణపాయం..