Site icon NTV Telugu

Devineni Uma: పోలవరం ప్రాజెక్టు చూడాలంటే.. అనుమతి కావాలని చెప్పడం సిగ్గుచేటు

Devineni Uma

Devineni Uma

Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య, నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గుచేటు అని ఆరోపించారు. 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలను వైసీపీ నేతలు సాధించలేకపోతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలంటే అనుమతి కావాలని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటు అని అభివర్ణించారు.

Read Also: Amit Shah Meeting With Jr NTR :ఊరికే ఇవ్వరు అపాయింట్‌మెంట్లు

టీడీపీ హయాంలో చేసిన డయాఫ్రమ్ వాల్ పనులకు రీయింబర్స్ ఇస్తే దాన్ని లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చుకోవడం బాధాకరమని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అసమర్థతతో లోయర్ కాఫర్ డ్యాం నుంచి ఇసుక రవాణాకు పాల్పడి వైసీపీ నేతలు నాశనం చేశారని ఆరోపించారు. పోలవరం నిర్మాణం చేతకాక చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై బురదజల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, టీడీపీ నాయకులను జైళ్లల్లో పెట్టడం తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన సీఎం జగన్‌కు ఎంత మాత్రం లేదని దేవినేని ఉమ విమర్శలు చేశారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో జగన్ కమిషన్‌లు దండుకున్నారని… రైతుల జీవితాలతో ఆటలాడుకున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version