Site icon NTV Telugu

Deputy CM Pawan: అనితర సాధ్యుడు.. సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు

Pawala

Pawala

Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం అవుతుంది.. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఇక, నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం అని కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబుకి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకున్నారు.

Read Also: HCA: మరోసారి వార్తల్లో హెచ్‌సీఏ.. మహ్మద్‌ అజహరుద్దీన్‌ పేరు తొలగింపు!

ఇక, ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

Exit mobile version