Site icon NTV Telugu

Pawan Kalyan: రప్పా రప్పాపై పవన్ కౌంటర్.. బరిలోకి దిగి చూపించు.. జగన్ కు సవాల్

Pawan 2

Pawan 2

Pawan Kalyan: ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకవేళ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు అని ప్రశ్నించారు. జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఇక, నరికేస్తాం చంపేస్తాం అనేవి మధ్య యుగం నాటి మాటలు.. ఇప్పుడు అలా మాట్లాడితే శిక్షిస్తామన్నారు. అలాగే, నేనేం రెచ్చగొట్టేలా మాట్లాడటం లేదు కానీ.. నరికేస్తాం… చంపేస్తాం అనడం కరెక్టా? అని అడిగారు. వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాళ్ల మాటలకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Read Also: Rashmi : చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. రష్మీ సంచలన నిర్ణయం..!

ఇక, వైస్ జగన్ తో పాటు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే వైసీపీ నేతలను బరిలోకి దిగి చూపించమను అని జగన్ కు సవాల్ విసిరారు. అలా కాకుండా అనవసరంగా ప్రజలను, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అవసర విషయాలపై నేను మాట్లాడొద్దనే కొన్నిసార్లు మౌనంగా ఉంటాను అని తెలిపారు. నేను మాట్లాడితే ఎలా ఉంటదో వైసీపీ నేతలకు తెలుసు అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Exit mobile version