NTV Telugu Site icon

Pawan Kalyan: ఈ నెల 28 నుంచి ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు..

Pawan

Pawan

Pawan Kalyan: ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించటం దేశంలో తొలిసారి.. సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయితీలకు తీర్చి దిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. 44 వేల కోట్లకు పైగా పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయి.. కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనపడటం లేదు.. వైసీపీ వచ్చిన తర్వాత గ్రామ పంచాయితీల ఆదాయం పడిపోయింది.. పంచాయతీలను బలోపేతం చేయటం మా ప్రభుత్వ లక్ష్యం.. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీలు కీలకంగా మరాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Read Also: Manu Bhaker: రిపోర్టర్స్‌ వరుస ప్రశ్నలు.. మను బాకర్ అసహనం!

ఇక, కొన్ని పంచాయితీలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటాయని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. అరకు కాఫీ, లేపాక్షి, చేనేత, గ్రానైట్ వంటి వాటి వల్ల ఆయా పంచాయితీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. యువత, మహిళలు గ్రామ సభల్లో పాల్గొనాలని కోరుతున్నాను.. ఎన్నికల కోసం ఎలా తరలి వచ్చారో గ్రామ సభలకు కూడా ఇలానే రావాలి అని కోరుతున్నాను.. పంచాయితీలకు చెందిన చాలా భూమి అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి.. గ్రామాల్లోకి రాగానే చెత్తా చెదారం కనపడుతోంది.. గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు.

Read Also: Bomb Threat : ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

అలాగే, డెన్మార్క్ నుంచి 6 వేల కోట్ల విలువైన కలప దిగుమతి చేసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీతో పోల్చితే 0.6 శాతం కూడా ఉందని డెన్మార్క్ నుంచి కలప దిగుమతి అవుతుంది.. 15 నుంచి 20 ఎకరాల్లో మనకు అవసరమైన కలపను పెంచాలని సూచనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. 87 పనులకు నరేగ పనులను నిర్ణయిస్తున్నాం.. కొన్ని పంచాయతీలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడకు విజిటింగ్ కోసం అందరూ వచ్చేలా చేద్దామని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.