Deputy CM Pawan: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన మాటామంత్రి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లెటూర్లు దేశానికి వెన్నుముక అందుకే పంచాయితీ రాజ్ శాఖ తీసుకున్నా.. సర్పంచ్ లే గెలిచాక మాట వినకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా వింటారు.. డిప్యూటీ సీఎంగా పంచాయితీ రాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే మొదట భయం వేసింది.. నా శాఖలో ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్లను ఏరికోరి తీసుకున్నా.. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.. ఉద్యోగులంటే నాకు అందుకే అభిమానం ఎక్కువ.. మీ బాగోగులు కోరుకునే వ్యక్తిని.. ఉద్యోగులకు ఏమీ చెయ్యగలనో ఆలోచిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నా.. ప్రమోషన్ కోసం మా కుటుంబం అంతా ఎదురు చూసే వాళ్ళం.. రోజులు లెక్క పెట్టుకునే వాళ్ళం.. అందుకే నా శాఖలో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు అన్ని క్లియర్ చేసాను.. గత ప్రభుత్వంలో ప్రమోషన్స్, బదిలీలకు రేట్ కార్డ్ పెట్టి చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు.
Read Also: Kodali Nani: ప్రభుత్వ కుట్రలను అడ్డుకునేందుకు జగన్ పోరాటాన్ని మొదలుపెట్టారు..
ఇక, మేము పారదర్శకంగా బదిలీలు, పదోన్నతులు ఇచ్చామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నా శాఖల్లో క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ పాలన ఉండాలి అనేది మొదటి నుండి పాలసీ పెట్టుకున్నా.. అర్హత, అనుభవం మేరకే బదిలీలు, పదోన్నతులు ఇచ్చాం.. ఎమ్మెల్యే, మంత్రులు రిఫరెన్స్ ఇచ్చినా అర్హత ఉంటేనే చేశాం.. ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు ప్రజలకు మరింతగా సేవలు అందించాలి.. శాఖను బలోపేతం చెయ్యడంలో కృషి చెయ్యాలి.. ఉద్యోగుల భద్రత మాకు చాలా ముఖ్యం.. ఎవరైనా దాడులు చేస్తే చర్యలు ఉంటాయి.. మహిళా ఉద్యోగులకు వేధింపులు ఉంటే కఠినంగా చర్యలు ఉంటాయి.. రాజకీయ నాయకులు ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సీరియస్ గా చర్యలు ఉంటాయి.. భవిష్యత్తులో ఉద్యోగులకు ఉపయోగపడే చాలా సంస్కరణలు తీసుకు వస్తామన్నారు.
Read Also: Snakes In House Wall: గోడలో దాక్కున్న పాములు.. భయపడిపోయిన స్థానికులు
అయితే, ఉద్యోగులంతా కుటుంబ సభ్యులుగా చూస్తాను అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. సమస్యతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు పరిష్కారం అయ్యి సంతోషంగా బయటికి వెళ్ళాలి.. ప్రమోషన్ రాగానే మీకెలా సంతోషం కలిగిందో.. సమస్య పరిష్కారం అవ్వగానే ప్రజల మొహంలో సంతోషం ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో మంది హిందు భక్తుల మనోభావాలకు సంబంధించింది.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాం.. పవిత్రమైన లడ్డూ ప్రసాదం కల్తీ జరగడం చాలా బాధాకరం అన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.. పరకామణి, లడ్డూ కల్తీ నిందితులను చట్టమే కాదు దేవుడు కూడా శిక్షిస్తాడు.. టీటీడీలో పట్టువస్త్రాలు నకిలీ వ్యవహారం మూడో స్కామ్.. పట్టు వస్త్రాలను నకిలీ చేసి మరో దుర్మార్గానికి తెరలేపారు.. హిందువులు, వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా సహించేది లేదు.. లడ్డూ, పరకామణి విచారణలో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
