తెలుగు రాష్ట్రాల్లో వరుస పరువు హత్యలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రేమ పేరుతో ముడిపడిన బంధాలు.విడిపోయి బతకడం ఇష్టంలేక ఇద్దరు కలిసి వుండాలనే నేపథ్యంలో పెళ్ళి చేసుకుని ఆనందంగా గడిపినా తల్లిదండ్రులు ఓర్వలేని స్థితిలో వుంటున్నారు. కులాలు వేరని, తక్కువ కులం ఎక్కువ కులం మంటూ పరువు ప్రతిష్టలకు పోయి పిల్లల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. ఇరుగుపొరుగు వారు ఏమనుకుంటారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తాను అతనితో బతకడం కన్నా చావడం మేలంటూ హత్య చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని బేగంబజార్‌లో నీరజ్ అనే యువకుడ్ని కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువకముందే.. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. లింగంపల్లి పొలం సమీపంలో యువకుడు చిత్రమురళి ని అతి కిరాతకంగా హత్య చేశారు దుండగలు. ఏడాది క్రితం వీణా అనే యువతితో మృతుడు మురళి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మృతుడు భార్య వీణా ఎల్లుకుంట్ల మహిళ పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. తమ కుటుంబసభ్యులే హత్య చేసి ఉంటారని వీణా పోలీసులకు ఫిర్యాదు చేయండంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
కేసునమోదు చేసుకున్న పోలీసులు.. ఇది పరువు హత్యా లేక, కన్న కూతురు మురళిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక హత్య చేయించారా ? లేక ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Agnipath protest: సికింద్రాబాద్‌లో విధ్వంసం.. రైల్వే పోలీసులే కారణం..!
