NTV Telugu Site icon

Visakhapatnam: కూతురి గర్భవతి కేసు..స్పీడ్‌గా కొనసాగుతున్న ట్రయల్స్: డీసీపీ విద్యాసాగర్‌

Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam: సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై లైగింకదాడికి పాల్పడి.. బాలిక గర్భం దాల్చడానికి కారణమై తండ్రికి యావజ్జీవ శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కన్న కూతురిని గర్భవతిని చేసిన కేసులో పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా.. ట్రయల్స్ కూడా స్పీడ్‌గా కొనసాగుతున్నాయని డీసీపీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీసీ మంగళవారం విశాఖపట్నంలో మీడియాకు తెలిపారు. తన 15 ఏళ్ల కన్న కూతురిని తండ్రి గర్భవతిని చేసిన విషయం తెలిసిందే.

Read also: Devara : సినిమా గురించి వస్తున్న ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..

తన కూతురిపైనే కన్న తండ్రి అత్యాచారాని పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు. అత్యాచారం ఫలితంగా మైనర్‌ బాలిక గర్భవతి అయిందని తెలిపారు. బాధిత బాలిక తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఆమె అచేతనంగా ఇంట్లో మంచానికే పరిమితం కావడంతో.. తండ్రి బాలికపై పలుమార్లు లైగింకదాడికి పాల్పడ్డాడని చెప్పారు. అయితే బాలిక గర్భం దాల్చినట్టు తండ్రికి తెలియడంతో దానిని తొలగించడం కోసం ఒకరోజు గైనిక్‌ మెడిసిన్‌ కావాలని అనుమానాస్పదంగా తిరగడంతో బంధువులకు అనుమానం వచ్చిందని.. బంధువులు ఫిర్యాదు చేశారని డీసీపీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. అయితే బంధువులు బాధితురాలి తరపున పోలీసులకు ఫిర్యాదు చేసే సమయానికి బాలిక 5 నెలల గర్భవతిగా ఉన్నట్టు గుర్తించామన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కేసు నమోదు అనంతరం నిందితుడైన తండ్రికి యావజ్జీవ శిక్ష పడిందని డీసీ తెలిపారు. నిందితుడికి యావజ్జీవ శిక్షతోపాటు బాధితురాలికి రూ. 10 లక్షలు నష్టం పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చిందని డీసీ తెలిపారు.