Site icon NTV Telugu

నీలి చిత్రాలతో బ్లాక్ మెయిల్..యువతి ఆత్మహత్య

ప్రేమించానని చెప్పి నీలి చిత్రాలను తీశాడో ప్రబుద్ధుడు. ఆమె నీలి చిత్రాలు తీసి గ్రామస్తులకు బంధువులకు పంపడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. వారి వికృత చేష్టలకు మహిళలు,యువతులు బలవుతున్నారు. వీరఘట్టం మండలం నడుకురు సంఘటన మరువక ముందే రేగిడి మండలం కొత్త చెలికానివలస గ్రామంలో మరొక సంఘటన చోటుచేసుకుంది.

దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ప్రేమించానని నమ్మించి నీలిచిత్రాలను చిత్రీకరించాడు. మద్యం మత్తులో నీలి చిత్రాలను కుటుంబీకులకు పంపాడు. భయంతో మనస్థాపానికి గురైన యువతి ఉరి వేసుకుంది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రేగిడి మండలం, చెలికానివలస లో ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘటన. ఆత్మహత్య చేసుకున్న యువతి శవాన్ని పూడ్చివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పూడ్చి పెట్టిన శవానికి రీపోస్టుమార్టం చేశారు. అమ్మాయిని వేధించిన యువకుడిని కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Exit mobile version