ఏపీలో 13 జిల్లాలను విభజిస్తూ కొత్తగా మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాను రెండు భాగాలుగా విభజించి విజయవాడ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటివరకు టీడీపీ నేతలు, నందమూరి వారసులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.
Read Also: కాణిపాకం ఆలయంలో దారుణం.. పాత రథచక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు
అయితే తాజాగా ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మాత్రం ఈ అంశంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆ మహనీయుడు నందమూరి తారకరామారావు గారు పుట్టిన జిల్లాకు ‘ఎన్టీఆర్ జిల్లా’ అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా స్వాగతిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని అభిప్రాయపడ్డారు. ‘జై ఎన్టీఆర్’ అంటూ ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
