AP Cyclone: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తుఫాన్ కారణంగా జిల్లాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ‘మొంథా తుఫాన్’ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్ర గాలులు, భారీ వర్షాల కారణంగా హోర్డింగులు కూలే ప్రమాదం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో వాటి కారణంగా ప్రాణ నష్టం జరగకుండా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Delhi official Logo: ఢిల్లీకి మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
అయితే, తీవ్ర గాలుల కారణంగా ఆస్బెస్టాస్, ఐరన్ రేకులు ఎగిరిపోయే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు తెలిపారు. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లల్లోని వ్యక్తులను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. జిల్లాలతో పాటు అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు. నదులు, వాగుల వైపు ప్రజలు వెళ్లకుండా చూడాలని చెప్పుకొచ్చారు.
Read Also: Warangal: ప్రేమవిఫలమైందని యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
ఇక, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని అధికారులు పేర్కొన్నారు. తీవ్ర గాలులు సమయంలో ప్రజలు ఇంటినుండి బయటకు రావొద్దు.. తుఫాను తీవ్రత తగ్గే వరకూ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు, ప్రధాన కార్యస్థానంలోనే ఉండాలి.. తుఫాన్ తీవ్రతపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
