NTV Telugu Site icon

Weather Update: అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుఫాన్

Cyclone

Cyclone

మాండూస్ తుఫాన్ తమిళనాడులో బీభత్సం కలిగించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుఫాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. మాండోస్ తుపాను ప్రభావం తమిళనాడుతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కనిపించింది. భారీ వర్షాలు పడుతున్నాయి. పెనుగాలులకు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నష్టం అంచనాలు ఇంకా తయారుచేయాల్సి వుందని అధికారులు తెలిపారు.

33 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 1469 ఆహారపు ప్యాకెట్లు , 2495 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శనివారం ఉదయం 8.30 గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.

Read Also: Telangana Congress : పీసీసీ కమిటీ ప్రకటన..18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. పేర్లు ఇవే..!

మరోవైపు వర్షాల వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు తయారుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టాలపై సర్వే చేస్తాం అన్నారు. అధికారుల నివేదికల ఆధారంగా రైతులను ఆదుకుంటాం అని, నారుమళ్లు మునిగితే విత్తనాలను అందిస్తాం అని భరోసా ఇచ్చారు.చంద్రబాబు హయాంలో 16 వందల 23 మండలాలను కరువుగా ప్రకటించారు. గత మూడేళ్ళలో కరువు మండలాలు లేవు.రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చార. ఎంత చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష కోట్లయినా రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారు. బంగారు రుణాలకూ వర్తింప చేస్తామన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.

Read Also: Vaishali Kidnap Case : హెల్ప్‌ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు.. కొరికారు : వైశాలి