Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
- బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
- అక్టోబర్ 26 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం
- తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు
- మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలకు తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం అక్టోబర్ 26 ఉదయం నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఈ తుఫాన్‌కు ‘అర్ణబ్’ (Arnab)గా నామకరణం చేసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి అక్టోబర్ 28 మధ్యాహ్న సమయానికి మచిలీపట్నం – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.
భారీ గాలులు, వర్షాల తీవ్రత.. మత్స్యకారులకు హెచ్చరికలు
తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 26 నుంచి రాష్ట్రంలో ఈదురుగాలుల తీవ్రత, వర్షాలు భారీగా పెరగనున్నాయి. సముద్రం తీవ్రంగా అలజడిగా మారనుండటంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో తీరం వెంబడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది.
Also Read
- CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
- CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
- Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
- Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వివిధ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27న కృష్ణా , ఎన్టీఆర్ జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో విశాఖపట్నం నుంచి బాపట్ల జిల్లాల వరకు అత్యంత తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. అలాగే అల్లూరి సీతారామరాజు (మన్యం), విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ‘ఆరెంజ్ బులెటిన్’ హెచ్చరికలు జారీ చేయగా, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ‘ఎల్లో వార్నింగ్’ జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
-
Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
-
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
-
Himanta Biswa Sarma: 57 ఏళ్ల వ్యక్తి Gen Zనా? రాహుల్ గాంధీపై హిమంత సెటైర్లు..
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
ట్రెండింగ్
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?