NTV Telugu Site icon

మధ్యాహ్నం 12 తర్వాత నో ఎంట్రీ….

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తీవ్రత అధికంగా ఉన్నది.  ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  దీంతో ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉదయం కర్ఫ్యూ విధిస్తున్నారు.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి.  మధ్యాహ్నం 12 నుంచి షాపులతో పాటుగా మామూలు వాహనాలు, రవాహా వాహనాలు నిలిచిపోనున్నాయి.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 12 గంటల తరువాత రాష్ట్రంలోకి అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారు.  దీంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్లో ఆందోళన మొదలైంది.  కర్ఫ్యూ నేపథ్యంలో జిల్లాలోకి అనుమతి ఉంటుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు.  అయితే, పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నారు.  ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట రాష్ట్రాల వాహనాలను మధ్యాహ్నం 12 తర్వాత అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు.