ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాష్ట్రంలో జూన్ 30 వ తేదీ వరకు సడలింపులు అమలులో ఉంటాయి.
ఆ జిల్లాలో మినహా మిగతా చోట్ల సడలింపులు… ఎందుకంటే…
