NTV Telugu Site icon

ఏపీలో ఈ సమయంలోనే బాణాసంచా కాల్చాలి..!

దీపావళి పండుగ వచ్చేస్తోంది.. ఇంటిల్లిపాది కలిసి ఉత్సాహంగా టపాసులు కాల్చుతూ సంతోషంగా గడుపుతారు.. అయితే, రోజురోజుకీ పెరుగోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కోర్టులు, ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.. దీపావళి రోజు పెద్ద ఎత్తున ధ్వని, వాయుష్య కాలుష్యం నమోదు అవుతుండడంతో.. కాలుష్య నియంత్రణ మండలి చర్యలను పూనుకుంది. ఇక, ఏపీలో దీపావళి పండుగ రోజు రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది… అది కూడా గ్రీన్‌ క్రాకర్స్‌‌తో పండుగ నిర్వహించుకోవాలని.. శబ్ధ కాలుష్యం లేకుండా చూడాలంటున్నారు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఛైర్మన్‌ ఏకే పరీడా.. మరోవైపు, కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి.