NTV Telugu Site icon

Sitaram Yechury: మోదీ చర్యలు ఫ్యూడల్ నిరంకుశత్వాన్ని సూచిస్తాయి

Sitaram Yechury On Modi

Sitaram Yechury On Modi

CPM Sitaram Yechury Sensational Comments On PM Modi: సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ చర్యలు ఫ్యూడల్ నిరంకుశత్వాన్ని సూచిస్తాయని కుండబద్దలు కొట్టారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ పార్లమెంట్‌లో ఓ భాగమని, కొత్త పార్లమెంటు బిల్డింగ్ అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. కొత్త పార్లమెంటును బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించామని తెలిపారు. ఒక రాజదండం తీసుకొచ్చారని, అయితే దానికి ఎలాంటి ప్రామాణికత లేదని అసంతృప్తి వ్యక్తపరిచారు. పరిపాలన అధికారం ప్రజలు ఇచ్చారని.. నెహ్రూ ఆ రాజదండాన్ని మ్యూజియంలో పెట్టారని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న వారు ప్రజాస్వామ్యంలో పరిపాలిస్తారని చెప్పారు.

KA Paul: నేను, జగన్ కలిస్తే.. చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడు

పార్లమెంటు భవన ప్రారంభానికి వెళ్ళద్దని.. రాజ్యంగ ఉల్లంఘనను సమర్ధించవద్దని తాను వైసీపీ అధినేత జగన్‌కు చెప్పానని సీతారాం ఏచూర తెలిపారు. తుగ్లక్ పాలన లాగా రూ.2వేల నోటు మోడీ వెనక్కు తీసుకున్నాడని మండిపడ్డారు. అసలు డీమానిటైజ్ ఎందుకు చేసారో మోడీకి క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బు అదానీ కంపెనీలలో పెట్టుబడిగా మారిందని ఆరోపించారు. కుంభకోణం గురించి మోడీ మాట్లడనని పార్లమెంటులో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రఫేల్, పెగసస్‌లాగా అదానీ విషయంలో కూడా ఏం జరగలేదని చూపించాలని బీజేపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. జేబీసీ అనేది వెంటనే ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో రాజకీయ నిరసనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్ధితుల ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని, దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో తాము కలుస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఎన్నికల నేపధ్యంలో తీసుకున్నవేనని చెప్పుకొచ్చారు.

Nandamuri Balakrishna:సెట్ లో శ్రీలీల చెంప పగలకొట్టిన బాలయ్య..

అంతకుముందు కూడా.. మోదీని గద్దె దింపితేనే దేశానికి రక్షణ అని, అందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ లౌకిక శక్తులను ఏకం చేయాలని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆ బాధ్యత ఉభయ కమ్యూనిస్టులపై ఉందన్నారు. బీజేపీ మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. మోదీ చెబుతున్న అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో లేదని.. ప్రజల సొమ్ముతో చేస్తున్న కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రారంభిస్తూ తాను తప్ప ఎవరూ చేయలేరని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Show comments