Site icon NTV Telugu

రాజధాని రైతుల బహిరంగ సభకు సీపీఎం దూరం

అమరావతి తిరుపతిలో జరిగే రాజధాని రైతుల బహిరంగ సభకు సీపీఎం దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాజధాని రైతులు తిరుపతి సభకు ఆహ్వానించారు.. మేమూ వెళ్లాలనుకున్నామ‌న్నారు. కేంద్ర బీజేపీ నేతలు ఈ సభలకు హాజరవుతున్నారని తెలిసిందని… రాష్ట్ర ప్రయోజనాలకు హాని తలపెట్టింది బీజేపీనేన‌ని ఆగ్ర‌హించారు.

అలాంటి బీజేపీ నేతలు పాల్గొనే సభల్లో మేం పాల్గొనబోమ‌ని.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేదే సీపీఎం విధానమ‌ని గుర్తు చేశారు మధు. ఢిల్లీలో ఓ మాట.. ఏపీలో మరో మాట మాట్లాడే బీజేపీ నేతలు పాల్గొనే సభలో పాల్గొనడం లేదన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలి.. బీజేపీ ద్రోహాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి వాచకం పలకాలని డిమాండ్ చేశారు.

Exit mobile version