కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా సీఎంకు లేఖలు రాస్తూ వచ్చిన రామకృష్ణ… ఈ సారి నకిలీ విత్తనాలు, నష్టపోయిన పత్తి రైతుల గురంచి తన లేఖలో ప్రస్తావించారు.. నంద్యాల కేంద్రంగానే 30 కంపెనీల పత్తి విత్తనాల సరఫరా జరిగినట్లు తెలుస్తోందని పేర్కొన్న ఆయన.. ఎకరాకు దాదాపు రూ.60 వేల నుంచి రూ. 80 వేలు ఖర్చుపెట్టి వేసిన పత్తి పంట పోవడంతో రైతులు లబోదిబో అంటున్నారన్నారు.. ఈ నకిలీ విత్తనాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. నష్టపరిహారం అందించి, పత్తి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. ఇందుకు కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని తన లేఖలో సీఎం వైఎస్ జగన్‌ను కోరారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
Read Also: Himachal Pradesh: కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఎన్నికల వేళ బీజేపీలోకి 26 మంది కీలక నేతలు
