NTV Telugu Site icon

పాల‌క వ‌ర్గం దోపిడీకి ఇదే కార‌ణం… సీపీఐ రామ‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

సీపీఐ రామ‌కృష్ణ ఈరోజు కొన్ని ఆస‌క్తిక‌రమైన వ్యాఖ్య‌లు చేశారు.  పాల‌క వ‌ర్గం దోపిడికి కార‌ణం కమ్యూనిస్టులు క‌లిసి ప‌ని చేయ‌క‌పోవ‌డ‌మే అని అన్నారు.  కమ్యూనిస్టులు క‌లిసి ప‌నిచేస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తే పాల‌క వ‌ర్గం దోపిడిని అరిక‌ట్టవ‌చ్చ‌ని, ఈ విష‌యంలో సీపీఐకి స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ఉంద‌ని, క‌లిసి ప‌నిచేస్తేనే సామాజిక న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు.  ఇక‌, ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు.  న్యాయం కోసం వెళ్తె విద్యార్ధుల‌ను అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  జాబ్ క్యాలెండ‌ర్‌ను రిలీజ్ చేసిన నిరుద్యోగుల‌ను ఏమార్చాల‌ని చూస్తున్నార‌ని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.  

Read: మంగ్లీ బోనాల పాట లిరిక్స్ పై రచ్చ!