మంగ్లీ బోనాల పాట లిరిక్స్ పై రచ్చ!

సింగర్ మంగ్లీ పండగ ఏదైనా తన పాట మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. జానపద, పల్లె పాటలు, దేవుళ్ళ పాటలకు సంబందించిన పాటలు పాడుతున్న మంగ్లీ ఈమధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యారు. భిన్నమైన స్వరం కలిగిన ఆమె సినిమాల్లోనూ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తున్నారు. అయితే రీసెంట్ ఆమె పాడిన బోనాల పాట సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపింది. ‘చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా’.. అనే ఓ బోనాల సాంగ్ యూట్యూబ్ లో వారం కిందట విడుదల చేశారు. ఈ పాటను రామస్వామి అనే లిరిసిస్ట్ రాయగా, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. అయితే ఈ పాటలోని లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంగ్లీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొక్కినట్టులేదు.. తిడుతున్నట్టుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది రైటర్ తప్పు అంటూ.. మంగ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. హిందూవాదులు కూడా ఈ పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తొలగించాలంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-